ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉంది

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:55 AM

బాలీవుడ్‌ నటుడు.. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలో సర్క్యూట్‌గా పాపులరైన అర్షద్‌ వార్సీ ప్రభా్‌సపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడుతూ ‘‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా చూశాను. నాకు నచ్చలేదు...

బాలీవుడ్‌ నటుడు.. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలో సర్క్యూట్‌గా పాపులరైన అర్షద్‌ వార్సీ ప్రభా్‌సపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడుతూ ‘‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా చూశాను. నాకు నచ్చలేదు. సినిమాలో అశ్వత్థామగా అమితాబ్‌ అదరగొట్టారు. ఇంత వయసులోనూ ఆయన ఈ స్థాయిలో నటించడం గొప్ప విషయం. ఆయనకు ఉన్న శక్తిలో కొంచెమైనా నాకు ఉండి ఉంటే.. ఈ పాటికి లైఫ్‌ సెట్‌ అయ్యిపోయేది. ఇందులో ప్రభాస్‌ పోషించిన పాత్ర బాలేదు. ఆయన పాత్ర జోకర్‌లా ఉంది. నేను ప్రభా్‌సను ‘మ్యాడ్‌ మాక్స్‌’ లాంటి సినిమాలో మెల్‌ గిబ్సన్‌లా చూడాలనుకుంటున్నాను. కానీ నేను చూసింది వేరు’’ అని అన్నారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై ప్రభాస్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 04:55 AM