Fauji Update: ఫౌజి అప్డేట్.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ ట్రీట్

ABN, Publish Date - Oct 19 , 2024 | 10:50 AM

ఇప్పటికే వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఫౌజి సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవడంతో ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ అందింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆ ట్రీట్ రివీల్ చేయబోతున్నారు. ఇంతకీ ఏం ప్లాన్ చేశారంటే.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఫౌజీ (Fauji) అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా నటిస్తున్నాడు. అందుకే ఈ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. దీనికంటే మంచి టైటిల్‌ ఆలోచన వస్తే.. దాన్నే ఫిక్స్‌ చేస్తారట. లేదా ‘ఫౌజీ’ టైటిల్‌నే ఖరారు చేస్తారట. 1947 కంటే ముందు సాగే కథ ఇది. ప్రభాస్‌ బ్రిటీష్‌ సైన్యంలో ఓ సోల్జర్‌గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఫౌజి సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవడంతో ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ అందింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆ ట్రీట్ రివీల్ చేయబోతున్నారు. ఇంతకీ ఏం ప్లాన్ చేశారంటే.


ప్రస్తుతం ప్రభాస్ 'రాజా సాబ్', 'ఫౌజి', 'సలార్ 2', 'కల్కి 2', 'స్పిరిట్' సినిమాల్లో నటిస్తున్నారు. మొదటగా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానున్న మారుతీ చిత్రం 'ది రాజా సాబ్' షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే మొదలుపెట్టిన హను రాఘవపూడి 'ఫౌజి' సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో డైరెక్టర్ మొదటి షెడ్యూల్‌లో ఇతర సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ నెల 23న బర్త్ డే అనంతరం ప్రభాస్ ఫౌజి షూటింగ్‌లోకి ఎంటర్ కానున్నడని సమాచారం. అలాగే 2, 3 వారాలు ఫౌజి సినిమాకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు ప్రభాస్‌ అభిమానులకు భారీ ట్రీట్‌ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న కొత్త సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన గత చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి మేకర్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్‌ నటించిన అరడజనకు పైగా సినిమాలు రీ రిలీజ్‌ చేయనున్నారు. మిస్టర్‌ పర్ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌, సలార్‌ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ కానున్నాయి. అక్టోబర్‌ 19, 20 తేదీల్లో సలార్‌ పార్ట్‌ 1 హైదరాబాద్‌లో స్పెషల్‌ షోలు ప్రదర్శించనున్నారు. 22న మిస్టర్‌ పర్ఫెక్ట్‌ చిత్రాన్ని దిల్‌ రాజు రీ రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్‌ పుట్టినరోజున ఆయన హీరోగా పరిచయమైన 'ఈశ్వర్‌’ రీ రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే ఓసారి రీ రిలీజ్‌ అయిన 'రెబల్‌’ చిత్రం ఈ 23న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వీటితోపాటు ఛత్రపతి, మిర్చి, సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు స్పెషల్‌ షోలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Updated Date - Oct 19 , 2024 | 10:50 AM