దీపావళి బరిలో పొట్టేల్
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:51 AM
అజయ్, యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన తారాగణంగా రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్ సడిగె నిర్మిస్తున్నారు....
అజయ్, యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన తారాగణంగా రూపొందుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సురేశ్‌కుమార్ సడిగె నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. దీపావళి సందర్భంగా ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌లో అనన్య నాగళ్ల, యువచంద్రకృష్ణ మాస్ పాత్రల్లో కనిపించారు. ప్రియాంక శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు