The Raja Saab: ఫేక్ న్యూస్ అలెర్ట్.. నిర్మాణ సంస్థ నుంచి వస్తేనే అఫీషియల్!

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:43 PM

‘ది రాజా సాబ్’ చిత్రానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ నెంబర్లు, మెయిల్ ఐడీలతో వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫైర్ అయింది. ఈ ఫేక్ వార్తలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు కూడా వారు రిపోర్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ కూడా ఈ విషయంలో సీరియస్‌గా రియాక్టైంది.

Prabhas in Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ (Prabhas and Maruthi Combo)లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని పొంగల్‌కు విడుదల చేసి.. ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్ర రిలీజ్, ప్రమోషన్స్‌ వ్యవహారాల్లో ఉండటంతో.. ఈ సినిమా షూటింగ్ కాస్త నిదానంగా నడుస్తోంది. ఇక ఇదే సరైన సమయం అనుకున్న కొందరు.. ‘ది రాజా సాబ్’ చిత్రానికి ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ నెంబర్లు, మెయిల్ ఐడీలతో వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫైర్ అయింది. (Fake News Spreading On The Raja Saab Movie)

Also Read- Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్


‘ది రాజా సాబ్’ ఆడిషన్స్ పేరిట కొన్ని ఫేక్ వార్తలు సర్క్యూలేట్ అవుతుండటం మా దృష్టికి వచ్చింది. అలాంటి వార్తలను నమ్మవద్దని మేము తెలియజేస్తున్నాము. అవన్నీ ఫాల్స్ న్యూస్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని కోరుచున్నాము. ఇలాంటివి ఏమైనా ఉంటే మా సంస్థ నుంచి అధికారికంగా తెలియజేస్తాము.. అని ప్రకటించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాతలు సదరు ఫేక్ వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కూడా రిపోర్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంపై సీరియస్ అవుతూ.. అలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన అధికారిక ప్రకటననే పరిగణనలోకి తీసుకోవాలని చెబుతూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు.

Read Latest Cinema News

Updated Date - Jul 18 , 2024 | 01:06 PM