Hari Hara VeeraMallu: ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ వచ్చేది ఎప్పుడంటే..
ABN, Publish Date - Nov 27 , 2024 | 07:51 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. మరో వైపు ఆయన చేస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు అవుతాయా? అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. అలా చూసే వారి కోసం తాజాగా ‘హరి హర వీరమల్లు’ టీమ్ ఓ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తోన్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ చిత్రీకరణను స్టార్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ అప్డేట్ వదిలారు.
Also Read- సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్
ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన బ్యాలెన్స్ షూట్ నిమిత్తం పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్ నుండి చిత్రీకరణలో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం అభిమానులంతా ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ అప్డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ విడుదల దగ్గర పడటంతో.. ముందు ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సైతం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ వీకెండ్ నుండి ఆయన ఈ సినిమా షూట్‌లో పాల్గొంటారని, ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌పై చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తనకు గ్యాప్ దొరికిన సమయంలో చేయాల్సిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ‘హరి హర వీరమల్లు’ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లుగా మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్ స్టార్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.