మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan Oath: పవన్ ప్రమాణ స్వీకారం.. మెగా పవర్‌ సంబరం

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:33 PM

"పవన్ కల్యాణ్‌ అనే నేను’ అంటూ జనసేనాని ఏపీ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా మంగళవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు.

"పవన్ కల్యాణ్‌ అనే నేను’ (Pawan kalyan Oath) అంటూ జనసేనాని (Janasena) ఏపీ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా మంగళవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. బుధవారం ఉదయం సభా ప్రాంగణానికి బస్సులో చేరుకున్నారు. మెగా కుటుంబ హీరోలు (mega Family) ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'పవన్ కల్యాణ్‌గారి ప్రమాణ స్వీకారానికి పయనం’ అంటూ నిహారిక కొణిదెల చేసిన పోస్ట్‌లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.



వేదికపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండో వ్యక్తిగా  'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ జనసేనాని ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గొంతు నుంచి 'కొణిదెల పవన్ కల్యాణ్‌ అనే నేను’ అనే మాట వినపడగానే సభా ప్రాంగణం కేరింతలతో దద్దరిల్లిపోయింది.

వేదిక ఉన్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య  చిరంజీవికి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పవన్  కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పవన్ ప్రమాణం చేస్తున్న సమయంలో వీడియో తీస్తూ మురిసిపోయారు. 



అలాగే పవన్ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయి కూడా ఆయనకు  శుభాకాంక్షలు చెబుతూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి’ అంటూ అకీరానందన్, ఆద్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ను రేణుదేశాయి ఇన్ స్టాలో షేర్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్  సొసైటీకి మంచి చేయాలని కోరుకుంటున్నాను పవన్ కల్యాణ్‌గారు అని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - Jun 12 , 2024 | 12:36 PM