Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:44 PM
హ్యాపీ బర్త్ డే సాయి దుర్గా ధరమ్ తేజ్ అంటూ మేనల్లుడుకి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ఆశీస్సులు అందించారు. సాయి దుర్గా తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. మంగళవారం సోషల్ మీడియాలో తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖని విడుదల చేశారు.
హ్యాపీ బర్త్ డే సాయి దుర్గా ధరమ్ తేజ్ అంటూ మేనల్లుడుకి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ఆశీస్సులు అందించారు. సాయి దుర్గా తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. మంగళవారం సోషల్ మీడియాలో తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఎంతమంది శుభాకాంక్షలు చెప్పినా.. తేజ్‌కి తన మేనమామలు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సలు అందిస్తేనే, అటు ఆయనకి, ఇటు ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫ్యాక్షన్‌గా ఉంటుంది. ఆ విషయం మెగాభిమానులలో ఎవరిని కదిలించినా చెబుతారు. అలాగే స్టార్ హీరోల బర్త్‌డేలకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ స్వయంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. అధికారికంగా ఓ లేఖను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మరి అందరికీ అలా పంపే ఆయన.. సొంత మేనల్లుడికి శుభాకాంక్షలు తెలుపుతారా? లేదా? అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులు పవన్ కళ్యాణ్ వరకు వెళ్లినట్లు ఉన్నాయి. వెంటనే లెటర్ వచ్చేసింది. ఈ లెటర్‌లో..
Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే
‘‘యువ కథానాయకుడు సాయి దుర్గా ధరమ్ తేజ్‌కి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సాయికి ధృడ చిత్తం, ఆత్మ విశ్వాసం, సంకల్ప బలం మెండుగా ఉన్నాయి. జీవితం అంటే పోరాటం అని తెలిసిన నటుడు. ప్రతి చిత్రంలో తనదైన శైలిని చూపిస్తున్నాడు. నటన మాత్రమే కాదు సామాజిక విషయాలపైనా స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు ధోరణులు అవలంబిస్తే కచ్చితంగా ఖండిస్తాడు. ఇటీవల కృష్ణా నది వరదలకు తన వంతు సాయం అందించి బాధితులకు అండగా నిలిచాడు. సాయి దుర్గా ధరమ్ తేజ్ కు మరిన్ని విజయాలు దక్కాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అంటూ హ్యాపీ బర్త్ డే సాయి దుర్గా ధరమ్ తేజ్ అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.