హీరోగా పరుచూరి మనవడు

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:55 AM

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘మిస్టర్‌ సెలెబ్రిటీ’ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు.

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘మిస్టర్‌ సెలెబ్రిటీ’ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరావు మాట్లాడుతూ ‘సెలబ్రిటీల గురించి వినిపించే రూమర్స్‌ను బేస్‌ చేసుకుని దర్శకుడు రవికిశోర్‌ కథ రాసుకుని బాగా తీశాడు. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. ‘నేను హీరోనవుతానని చెప్పగానే మా తాతగారు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవరికీ చెప్పకుండా జానియర్‌ ఆర్టి్‌స్టగా పని చేశాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు.. అని తాతగారు చెప్పారు. సినిమా చూసి మా టీమ్‌ను ఆశీర్వదించాలి’ అన్నారు సుదర్శన్‌. సినిమాలో పతాక సన్నివేశం విభిన్నంగా ఉంటుందని దర్శకుడు రవికిశోర్‌ చెప్పారు.

Updated Date - Sep 03 , 2024 | 05:55 AM