తెలుగులో ‘పా..పా’

ABN, Publish Date - Dec 01 , 2024 | 06:30 AM

తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘డా..డా’ మూవీని తెలుగులో ‘పా..పా’ టైటిల్‌తో జె.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం డిసెంబరు 13న తెలుగు రాష్ట్రాలతోపాటు...

తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘డా..డా’ మూవీని తెలుగులో ‘పా..పా’ టైటిల్‌తో జె.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం డిసెంబరు 13న తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా..పా’ పేరుతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంజిఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేస్తున్నారు’ అని నిర్మాత నీరజ కోట తెలిపారు. సినిమాలో భాగ్యరాజా, వీటీవి గణేశ్‌, ఐశ్వర్య, ప్రదీప్‌ శక్తి తదితరులు నటించారు.

Updated Date - Dec 01 , 2024 | 06:30 AM