పక్కా గోదావరి జిల్లాల సినిమా

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:54 AM

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘ఆయ్‌’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. అంజి కె. మణిపుత్ర దర్శకుడిగా...

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘ఆయ్‌’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. అంజి కె. మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం పిఠాపురంలో చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ ‘ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. కడుపుబ్బా నవ్విస్తుంది. పిఠాపురంలో సినీ వేడుక నిర్వహించి కొత్త అడుగు వేశాం’ అన్నారు. ‘ఈ సినిమా కోసం దర్శకుడు మమ్మల్ని చెట్టు ఎక్కించి, బురదలో పడేశారు. ఆయన మీద కోపాన్ని మళ్లీ తీర్చుకుంటాను. మా కష్టానికి ప్రతిఫలం విజయం రూపంలో మీరు అందించాలి’ అని హీరో నార్నే నితిన్‌ కోరారు.

Updated Date - Aug 06 , 2024 | 04:54 AM