మన బతుకులు కలలు కావు.. కళలు
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:09 AM
దిలీ్‌పప్రకాశ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘ఉత్సవం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. హాస్యనటుడు బ్రహ్మానందం స్టేజ్ ప్లేలోని పవర్‌ఫుల్ డైలాగుతో...
దిలీ్‌పప్రకాశ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘ఉత్సవం’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. హాస్యనటుడు బ్రహ్మానందం స్టేజ్ ప్లేలోని పవర్‌ఫుల్ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ‘మన బతుకులు కలలు కావు.. కళలని గుర్తించే రోజులు రావా’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దిలీప్, రెజీనాల లవ్‌ట్రాక్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. నాటకాలు అంటే ఇష్టపడే యువతిగా రెజీనా నటించారు. ఈ నెల 13న విడుదలయ్యే ‘ఉత్సవం’లో నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించారు. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేశ్ పాటిల్ ఈ సినిమాను నిర్మించారు.