మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

ABN, Publish Date - Feb 03 , 2024 | 07:16 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదల తేదీలో స్వల్ప మార్పు జరిగింది. ఇంతకు ముందు ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆ తేదీకి రావడం లేదని తెలుపుతూ.. మేకర్స్ న్యూ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) విడుదల తేదీలో స్వల్ప మార్పు జరిగింది. ఇంతకు ముందు ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆ తేదీకి రావడం లేదని తెలుపుతూ.. మేకర్స్ న్యూ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. ఈ సినిమాను మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని తెలుపుతూ.. మేకర్స్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. (Operation Valentine New Release Date)

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, రిపబ్లిక్ డేకి ముందు దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ వందేమాతరంతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ చిత్రంగా రాబోతోన్న ఈ సినిమా తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి. మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన మొదటి సింగిల్ వాఘా బోర్డర్‌లో లాంచ్ చేశారు. మరో నెలలో సినిమా థియేటర్లలోకి రానుంది కాబట్టి, ప్రమోషన్స్‌‌ను మరింత దూకుడుగా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.


ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్ (Manushi Chhillar) రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపించబోతుంది. శక్తి ప్రతాప్ సింగ్ (Shakti Pratap Singh Hada) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

**************************

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

Updated Date - Feb 03 , 2024 | 07:16 PM