సెట్స్‌లోకి...

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:44 AM

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు...

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా సెట్స్‌లోకి బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘పవన్‌, అనుపమ్‌ ఖేర్‌ కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయి. అభిమానులకి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇది’’ అని మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 12:44 AM