Matka: వరుణ్ తేజ్.. మరో వింటేజ్ బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల

ABN, Publish Date - Oct 20 , 2024 | 08:32 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వింటేజ్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Mega Prince Varun Tej in Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ (Matka) రిలీజ్‌కు రెడీ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం యమా జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా రివీల్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో దూసుకెళుతోంది. ఈ సాంగ్‌తో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. మరోవైపు సరికొత్త పోస్టర్స్‌ని సినిమాపై క్రేజ్ పెంచే పనిలో ఉన్నారు మేకర్స్.

Also Read- Love Reddy: రెబల్‌ స్టార్ సపోర్ట్.. యూనిట్ పిచ్చ హ్యాపీ

‘మట్కా’ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ‘మట్కా’ 25 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్‌లో ఇంటెన్స్ అండ్ వింటేజ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూడగానే అదిరిపోయిందనేలా స్పందనను రాబట్టుకుంటుండటం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Matka New Poster Goes Viral)


‘మట్కా’ వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. ఈ సినిమాపై మెగా ప్రిన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా హిట్టవడం ఆయనకు ఎంతో ముఖ్యం కూడా. వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2024 | 08:32 PM