Roti Kapda Romance: ఈ సినిమాలో.. ఏదో మ్యాటర్ ఉందనిపిస్తోంది
ABN, Publish Date - Mar 12 , 2024 | 03:53 PM
ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై ఫ్రెండ్ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా (Lucky Media) అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal).. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapada Romance ). హర్ష నర్రా (Harsha Narra), సందీప్ సరోజ్ (sandeep saroj), తరుణ్ (tarun), సుప్రజ్ రంగా (Supraj Ranga), సోనూ ఠాకూర్ (Sonu thakur ), నువ్వేక్ష (Namrata Darekar Nuveksha), మేఘలేఖ (Meghalekha Kacharla ), ఖుష్బూ చౌదరి (Khushboo Choudhary) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి (Vikram reddy) దర్శకుడు. ఏప్రిల్ 12న విడుదలకు ఈ చిత్రం రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన రాగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై ఫ్రెండ్ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్, శివాజీ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్‌లు ఈ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఇటీవలేల నేను ఈ సినిమా చూశానని, నేటి యూత్‌కు నచ్చే విధంగా ట్రెండీగా ఉందని.. పాటలు చాలా బాగున్నాయని, నటీనటులంతా చక్కగా నటించారన్నారు. దర్శకుడు విక్రమ్ రెడ్డి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడని, ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభ గల దర్శకుడు దొరికాడని, ఈ సినిమా ప్రేక్షకులందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.
నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే, ఈ బ్యానర్‌లో నేను చేసిన మేం వయసుకు వచ్చాం రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. టైటిల్ చాలా ట్రెండీగా ఉందని, కంటెంట్ కూడా చాలా బాగుందని.. ఈ సినిమా ఘన విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నా అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సినిమా నిర్మాణం మీద, కథ మీద నాలెడ్జ్, గ్రిప్ ఉన్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్. కొత్తవాళ్లతో సినిమా తీయడం ఈ రోజుల్లో ఎంతో గట్స్ ఉండాలని.. ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది. మ్యాటర్ ఉన్న సినిమాలా అనిపిస్తుందన్నారు.
చిత్ర దర్శకుడు విక్రమ్ రెడ్డి (Vikram reddy) మాట్లాడుతూ.. యానిమల్ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారని, ఈ పాట చిత్రీకరిస్తున్నప్పుడు నా స్నేహితులు గుర్తుకు వచ్చారని, ఆల్ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ పెద్ద సినిమాలతో పోటిపడే గట్టి కంటెంట్‌తో నిర్మించిన చిత్రమిదని.. ఫ్రెండ్‌షిప్ అనేది ఎవర్ గ్రీన్, ఈ పాట కూడా తప్పకుండా అందరి మనసులకు హత్తుకుంటుందన్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సమ్మర్‌కు పెద్ద విజయాన్ని అందుకుంటుందన్నారు. ఈ సమావేశంలో హర్ష, తరుణ్, సందీప్, సుప్రజ్. కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్ సోనూ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.భరత్ రెడ్డి పాల్గొన్నారు.