పుట్టిన రోజున ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Dec 19 , 2024 | 06:17 AM
తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (టీఎ్‌ఫడీసీ) చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు(వెంకటరమణారెడ్డి) బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన పుట్టినరోజు కావడం...
తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (టీఎ్‌ఫడీసీ) చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు(వెంకటరమణారెడ్డి) బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. కుటుంబ సభ్యులతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సందర్భంగా దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ‘చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇంకా అభివృద్ధి సాధించాలి. టీఎ్‌ఫడీసీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తా. ప్రభుత్వానికీ, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేస్తా. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా.
తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చేలా చూడాలి’ అన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన దిల్ రాజుకు హీరో రామ్‌చరణ్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.