OMG Teaser: నవ్విస్తూనే భయపెట్టేస్తోన్న ఓ మంచి ఘోస్ట్..

ABN , Publish Date - May 11 , 2024 | 05:34 PM

హారర్‌కు హాస్యం జోడించి నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా రూపొందుతోన్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్ (OMG)’. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ నవ్విస్తూనే భయపెట్టేస్తోంది.

OMG Teaser: నవ్విస్తూనే భయపెట్టేస్తోన్న ఓ మంచి ఘోస్ట్..
O Manchi Ghost Movie Still

ఈ మధ్య కాలంలలో హారర్, కామెడీ మిక్స్ చేసి వస్తోన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే ఇటువంటి చిత్రాలకు థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీ పరంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. ఇప్పుడదే ఫార్ములాను నమ్ముకుని ఓ టీమ్ రెడీ అవుతోంది. హారర్‌కు హాస్యం జోడించి నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్ (OMG)’. కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore), నందితా శ్వేత (Nandita Swetha), షకలక శంకర్ (Shakalaka Shankar), నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. డా. అబినికా ఇనాబతుని నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (O Manchi Ghost Movie Teaser Out)

*Elections 2024: ఓటు ఎంత బలమైనదో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా రిలీటైన టీజర్ నవ్విస్తూనే భయపెట్టేస్తోంది. ‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా’ అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ.. ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీ ఈ టీజర్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఘోస్ట్‌గా నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా ఉంది. (O Manchi Ghost Movie Teaser Talk)


Nanditha-Swetha.jpg

ఓవరాల్‌గా అయితే ఈ టీజర్ సినిమాపై భారీగానే అంచనాలను పెంచేస్తోంది. ఈ టీజర్‌లోని విజువల్స్, అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆర్ఆర్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ అన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సుప్రియ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయగా.. ఎడిటింగ్ బాధ్యతల్ని ఎం.ఆర్.వర్మ నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

Updated Date - May 11 , 2024 | 05:34 PM