‘ఆయ్‌’ టీమ్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:33 AM

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా రూపొందిన ‘ఆయ్‌’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సాధించింది. ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు కూడా రావడంతో టీమ్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు..

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా రూపొందిన ‘ఆయ్‌’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సాధించింది. ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు కూడా రావడంతో టీమ్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. శనివారం యూనిట్‌ సభ్యులు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలుసుకుని ఆయన అభినందనలు పొందారు. బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ ‘ఆయ్‌’ హిట్‌ కావడంతో ఎన్టీఆర్‌ వారిని అభినందించారు. నార్నే నితిన్‌, నయన్‌ సారిక, అంకిత్‌ కొయ్య, నిర్మాతలు బన్నీ వాసు, ఎస్‌.కె.ఎన్‌. శనివారం ఎన్టీఆర్‌ను కలిశారు.

Updated Date - Aug 18 , 2024 | 01:33 AM