మోహన్‌బాబుకు నోటీసులు... గన్స్ సరెండర్
ABN, Publish Date - Dec 17 , 2024 | 06:02 AM
మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ మధ్య జరిగిన ఇంటి గొడవలు, మీడియా జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు...
మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ మధ్య జరిగిన ఇంటి గొడవలు, మీడియా జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఇప్పటికే మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావడానికి ఈ నెల 24 వరకు సమయం ఇచ్చామన్నారు.
మోహన్‌బాబుకు లైసెన్స్‌డ్ గన్లు రెండు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒకటి, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్ స్కూల్‌లోని ఇంట్లో మరో గన్ ఉంది. వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లలో మోహన్‌బాబు సిబ్బంది అందజేశారు.
హైదరాబాద్ సిటీ, చంద్రగిరి (ఆంధ్రజ్యోతి)