రూ.రెండు కోట్లు కాదు.. రూ.అరవై లక్షలే

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:56 AM

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. అందులో తన అనుమతి లేకుండా ‘గుణ’ సినిమాలోని పాటను వాడారని సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో...

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. అందులో తన అనుమతి లేకుండా ‘గుణ’ సినిమాలోని పాటను వాడారని సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో చిత్ర బృందంపై కేసు వేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా పాటను వాడుకున్నందుకు ఇళయరాజా, ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్ర నిర్మాతలు రూ.రెండు కోట్లు ఇవ్వాలని లేదా సినిమాలో ఆ పాటను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై స్పందించిన మేకర్స్‌.. దీనికి పరిష్కారంగా ఇళయరాజాకు రూ.60 లక్షలు చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం.

Updated Date - Aug 06 , 2024 | 04:56 AM