రామ్‌చరణ్‌ సొంత చిత్రంలో నిఖిల్‌

ABN, Publish Date - Jul 02 , 2024 | 12:29 AM

వి మెగా పిక్చర్స్‌ పతాకంపై చిత్రాలు నిర్మించడానికి హీరో రామ్‌చరణ్‌ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. యూవీ క్రియేషన్స్‌ విక్రమ్‌రెడ్డి ప్రొడక్షన్‌ పార్ట్‌నర్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ అగర్వాల్‌...

వి మెగా పిక్చర్స్‌ పతాకంపై చిత్రాలు నిర్మించడానికి హీరో రామ్‌చరణ్‌ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. యూవీ క్రియేషన్స్‌ విక్రమ్‌రెడ్డి ప్రొడక్షన్‌ పార్ట్‌నర్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ అగర్వాల్‌ వీరిద్దరితో చేతులు కలిపారు. నిఖిల్‌ హీరోగా నిర్మించే తొలి చిత్రం ‘ది ఇండియా హౌస్‌’ నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించే ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషించనున్నారు. 1905వ సంవత్సరం నేపథ్యంగా ప్రేమ, విప్లవం అంశాలతో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ హంపీలోని విరూపాక్ష దేవాలయంలో ప్రారంభమైంది. మంగళవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఈ చిత్రానికి కెమరూన్‌ బ్రైసన్‌ ఛాయాగ్రాహకుడు.

Updated Date - Jul 02 , 2024 | 12:29 AM