మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nihar kapoor: ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:57 PM

సహజనటి జయసుధ తనయుడు నిహార్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రికార్డ్‌ బ్రేక్‌’. చదలవాడ పద్మావతి నిర్మాణంలో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

సహజనటి జయసుధ తనయుడు నిహార్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రికార్డ్‌ బ్రేక్‌’. చదలవాడ పద్మావతి నిర్మాణంలో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా నిహార్‌ విలేకర్లతో మాట్లాడారు.

గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు చిత్రం చేసిన సమయంలో చదలవాడ శ్రీనివాసరావు ఈ కథ చెప్పారు. కథ ఎగ్జైటింగ్‌గా అనిపించి ఈ సినిమా చేశా. ఇందులో ఇద్దరు అనాధలు అడవిలో పెరుగుతూ ఉంటాం. మేము ట్విన్స్‌. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్‌ లెవెల్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ దాకా వెళ్లడం ఆ ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. పక కమర్షియల్‌ చిత్రమిది. ఇద్దరు అనాధలు ఇంటర్నేషనల్‌ లెవర్‌కి ఎలా వెళ్లారు అనేది భావోద్వేగంగా చెప్పాం. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. చదలవాడకు సినిమా అంటే పాషన్‌. దేశభక్తి కథను చక్కని భావోద్వేగాలతో సందేశ్మాకంగా చెప్పారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. ఈ కథ గురించి చెప్పినప్పుడు యునీక్‌ కథ ఎంచుకున్నావ్‌ అందిఇ. ట్రైలర్‌ చూసి అమ్మ మెచ్చుకుంది. సినిమా చూసి ఎలా స్పందిస్తుందో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇకపై కంటిన్యూగా సినిమాలు చేయాలనుకుంటున్నా. డైరెక్షన్‌ కోర్స్‌ పూర్తయింది. ఓటీటీ, ఫీచర్‌ సినిమా కోసం కథలు సిద్ధం చేశా. టైం సెట్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ చేస్తా అని అన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 09:35 AM