పుట్టినరోజున కొత్త కబురు
ABN, Publish Date - Oct 22 , 2024 | 02:25 AM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అప్‌డేట్...
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అప్‌డేట్ ఉంటుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ప్రభాస్ ఇంతవరకూ టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ‘రాజా సాబ్’ ను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ అలా్ట్ర స్ఠయిలి్‌షగా కనిపిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రీకరణ తుది దశలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత చెప్పారు.