Honeymoon Express: ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’కు స్క్రీన్లు పెరిగాయ్..

ABN, Publish Date - Jun 22 , 2024 | 09:24 PM

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో థియేటర్ల సంఖ్య పెరిగినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా.. రిలీజ్ రోజే 70 స్క్రీన్లకు చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Honeymoon Express Movie Poster

చైతన్య రావ్ (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Heabh Patel) జంటగా నటించిన సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ (Honeymoon Express). శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో థియేటర్ల సంఖ్య పెరిగినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా.. రిలీజ్ రోజే 70 స్క్రీన్లకు చేరింది. సినిమా టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్స్‌లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారని.. అలాగే బీ, సీ సెంటర్లలో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయని తాజాగా దర్శకనిర్మాతలు ప్రకటించారు.

Also Read-Jr NTR: తారక్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని (Bala Rajashekaruni) చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన ‌పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందని.. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయని.. మేకర్స్ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ‌లోని నాలుగు పాటలు బాగున్నాయని అంటున్నారని.. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట నటన ప్రేక్షకులను ఆకర్షిస్తోందని.. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు చెప్పుకొచ్చారు.


తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్‌గా నటించిన ఈ సినిమాని దర్శకుడు బాలరాజశేఖరుని చక్కగా తెరకెక్కించి ఉంటాడనే అభిప్రాయాన్ని.. సినిమా విడుదలకు ముందు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి వారు వెల్లడించిన విషయం తెలిసిందే. వారి నమ్మకం ఆడియన్స్ ఆదరణతో నిజమవడం పట్ల హ్యాపీగా ఉన్నామని మూవీ టీమ్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Latest Cinema News

Updated Date - Jun 22 , 2024 | 09:24 PM