Nenu Keerthana: ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రం
ABN, Publish Date - Apr 04 , 2024 | 03:46 PM
‘నేను-కీర్తన’ మూవీ టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు(సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని అన్నారు టి. ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు దర్శకుడిగా, హీరోగా నటించిన చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
‘నేను-కీర్తన’ (Nenu Keerthana) మూవీ టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు(సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని అన్నారు టి. ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మీకుమారి నిర్మించిన ‘నేను-కీర్తన’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ‘రజాకర్’ దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Nenu Keerthana Movie First Look Launch)
*Manjummel Boys: ఇలాంటి.. స్నేహితులు మన జీవితంలోనూ ఉండాలని కోరుకుంటారు
చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్‌లో, టీజర్‌లో సక్సెస్ కళ కనబడుతోందని తెలుపుతూ.. ముఖ్య అతిథులుగా హాజరైన వారంతా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను-కీర్తన’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా ఈ సినిమా కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని దర్శకహీరో చిమటా రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. (Nenu Keerthana Movie Teaser Launched)
ఈ సినిమాలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ రిషిత కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, రాజ్ కుమార్, ‘ఎర్రచీర’ సుమన్ బాబు తదితరులు పాల్గొని ‘నేను-కీర్తన’ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. (Nenu Keerthana Telugu Movie)
ఇవి కూడా చదవండి:
====================
*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..
************************
*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్
*******************************
*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు
******************************