Raj Tarun - Lavanya: కౌన్సిలింగ్ ఇచ్చి.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు!
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:03 PM
రాజ్‌తరుణ్(Raj Tarun), లావణ్య (Lavanya) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు హీరోయన మాల్వీ మల్హోత్రతో డేటింగ్‌లో ఉన్నాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో (Narsing police) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే
రాజ్‌తరుణ్(Raj Tarun), లావణ్య (Lavanya) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు హీరోయన మాల్వీ మల్హోత్రతో డేటింగ్‌లో ఉన్నాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో (Narsing police) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! శుక్రవారం రాత్రి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని న్యాయవాది ద్వారా తెలియడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. రూ. 5కోట్టు ఇస్తాం కేసు వెనక్కి తీసుకోమంటూ ఫోన కాల్స్ వచ్చాయంటూ, తన మరణానికి రాజ్‌తరుణ్ కుటుంబంతోపాటు మాల్వీ మల్హోత్ర కారణమంటూ న్యాయవాదితో చేసిన చాటింగ్‌లో పేర్కొంది.
అయితే లావణ్య శనివారం నార్సింగి పోలీస్‌ల ముందు విచారణకు హాజరైంది. శనివారం లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఫిర్యాదుకు సంబంధించి తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు అందజేసింది లావణ్య. హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు నార్సింగ్ పోలీసులు. స్టేట్‌మెంట్‌లో తనకు సెటిల్మెంట్ చేసుకోవాలంట్టు రెండు నెంబర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది లావణ్య. అవసరమైతే సోమవారం పోలీస్ స్టేషన్ కి పిలుస్తామని లావణ్యకు పోలీసులు చెప్పారు. ఆమె మాత్రం న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానంటోంది.