కొత్త ఇంట్లో నరేశ్‌

ABN, Publish Date - Aug 23 , 2024 | 06:27 AM

సీనియర్‌ నటుడు నరేశ్‌ ఓ ఇంటి వాడయ్యారు. చిలుకూరి బాలాజీ అలయానికి సమీపంలో ఉన్న ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ఓ పెద్ద ఇల్లుని

సీనియర్‌ నటుడు నరేశ్‌ ఓ ఇంటి వాడయ్యారు. చిలుకూరి బాలాజీ అలయానికి సమీపంలో ఉన్న ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ఓ పెద్ద ఇల్లుని అత్యాధునిక వసతులతో నిర్మించి ఇటీవలే గృహ ప్రవేశం చేశారు. ఈ భవంతికి విజయకృష్ణ మందిరం అని పేరు పెట్టారు. ఇక్కడే హీరో కృష్ణ, ఇందిరా దేవి విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఇందిరా దేవి స్ఫూర్తి వనాన్ని కూడా ఆ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన చిత్ర ప్రముఖులకు నరేశ్‌, పవిత్ర స్వాగతం పలికారు. నరేశ్‌ కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Aug 23 , 2024 | 06:27 AM