మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గాంజా శంకర్‌ చిత్ర యూనిట్‌కు.. నార్కోటిక్‌ బ్యూరో నోటీసులు

ABN, Publish Date - Feb 19 , 2024 | 02:43 AM

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న గంజా శంకర్‌ చిత్రానికి తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల విడుదలైన గంజాశంకర్‌ ప్రచార చిత్రాన్ని చిత్ర బృందం యూట్యూబ్‌లో...

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న గంజా శంకర్‌ చిత్రానికి తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల విడుదలైన గంజాశంకర్‌ ప్రచార చిత్రాన్ని చిత్ర బృందం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. అందులో లీఫీ వెజిటబుల్స్‌ మాటున గంజాయి స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ వినియోగంతో యువతను పెడదోవ పట్టించే అంశాలు ఉన్నాయని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్ర, అంతరరాష్ట్ర ఘరానా స్మగ్లర్స్‌ ఆటకట్టిస్తూ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు సినిమా ఇండస్ట్రీ వారు గంజాయి, డ్రగ్స్‌ వంటి కంటెంట్‌ను పెట్టి సినిమాలు తీస్తున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలని తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య నోటీసుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Feb 19 , 2024 | 02:43 AM