మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prathinidhi 2: ‘ప్రతినిధి 2’ సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందంటే..

ABN, Publish Date - May 07 , 2024 | 07:45 PM

హీరో నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని.. రిలీజ్‌కు అన్ని రకాలుగా సిద్ధమైంది.

Nara Rohit in Prathinidhi 2

హీరో నారా రోహిత్ (Nara Rohit) కాస్త గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని.. రిలీజ్‌కు అన్ని రకాలుగా సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మే 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Prathinidhi 2 Censor Completed)

*AP Elections - Pawan Kalyan: సినీరంగం నుంచి ఒక్కొక్కరు బయటికొస్తున్నారు

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేశారు, ఈ పాటలో రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు కనిపించారు. రెండవ పాట- జర్నలిస్ట్ గీతం‌లో కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం ఇవ్వగా స్వరాగ్ కీర్తన్, జయంత్ పాడిన పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది. ఇలా ప్రతీది సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. మే 10న వస్తోన్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. (Prathinidhi 2 Movie)


‘ప్రతినిధి 2’ చిత్రం.. ‘ప్రతినిధి’ సిరీస్ నుండి వస్తోన్న రెండవ ఫ్రాంచైజీ చిత్రం. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా (Siree Lella) కథానాయికగా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Read Latest Cinema News

Updated Date - May 07 , 2024 | 07:45 PM