NaniOdela2: మాస్ మ్యాడ్‌నెస్ బిగెన్స్

ABN, Publish Date - Sep 19 , 2024 | 10:55 PM

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి సిద్ధమయ్యారు. ‘దసరా’ తర్వాత మరోసారి నాని.. శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారు. ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా దర్శకుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

NaniOdela2 Movie Shooting Spot

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మరో హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి సిద్ధమయ్యారు. ఫస్ట్ కొలాబరేషన్ చిత్రం ‘దసరా’తో రూ. 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి ఘన విజయం సాధించిన తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ చేతులు కలిపారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘నాని-ఓదెల 2’, దసరా ఇంపాక్ట్‌ని 100 రెట్లు క్రియేట్ చేస్తుందనే శ్రీకాంత్ ఓదెల స్టేట్మెంట్‌తో సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. రీసెంట్‌గా షూట్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో నుండి బిహైండ్ స్నాప్‌ను షేర్ చేసిన దర్శకుడు, అద్భుతమైన ప్రోడక్ట్‌ని అందించడానికి తన కమిట్మెంట్‌ని చూపించారు.

Also Read- NagaBabu: నాగబాబు కొటేషన్స్‌.. కొరియోగ్రాఫర్‌ కోసమేనా

‘‘మార్చి 7, 2023 - నా ఫస్ట్ సినిమా #దసరాకి నేను చెప్పిన చివరి ‘కట్, షాట్ ఓకే’. సెప్టెంబర్ 18, 2024 - #NaniOdela2 అనౌన్స్‌మెంట్ వీడియో కోసం మళ్ళీ ‘యాక్షన్’ చెప్పాను. 48,470,400 సెకన్లు గడిచాయి! ప్రతి సెకను నా నెక్స్ట్ కోసం సిన్సియర్‌గా వున్నాను. NaniOdela2తో నాని అన్నకు, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌కు.. ‘దసరా’ ప్రభావాన్ని 100 రెట్లు క్రియేట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను’’ అని శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈ ట్వీట్‌కు నాని కూడా రియాక్ట్ అయ్యారు. తన రెస్పాన్స్‌తో అభిమానులని అలరించారు.. ‘‘ఇతని మ్యాడ్‌నెస్ నా జీవితంలోకి తిరిగి వచ్చింది. Be prepared to be blown away’’ అని అన్నారు. NaniOdela2 చిత్రం నానిని ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేస్తూ, యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ నెరేటివ్‌తో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించనున్నారు. ఇది నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరికీ మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 19 , 2024 | 10:55 PM