Nandamuri Kalyanram : పుట్టిన రోజు.. రెండు అప్డేట్స్
ABN, Publish Date - Jul 06 , 2024 | 05:38 AM
నందమూరి కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 21వ చిత్రం లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. తన పిడికిలి బిగించి ఫైర్‌తో, కుర్చీలో కూర్చున కల్యాణ్‌రామ్ తన చుట్టూ ఉన్న గూండాలని ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తోంది.
నందమూరి కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 21వ చిత్రం లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. తన పిడికిలి బిగించి ఫైర్‌తో, కుర్చీలో కూర్చున కల్యాణ్‌రామ్ తన చుట్టూ ఉన్న గూండాలని ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేయనున్నారు. అలాగే ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పారు. సీనియర్ నటి విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బింబిసారకు సీక్వెల్
అలాగే కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగానే ‘బింబిసార 2’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బింబిసార’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం వివరాలను వెల్లడించారు. బింబసార కంటే యుగాల ముందు త్రిగర్తల రాజ్యాన్ని ఏలిన లెజెండ్‌ను చూడడానికి సిద్దంగా ఉండండి’ అని శుక్రవారం అనౌన్స్ చేశారు. స్ర్కీన్ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి అనిల్ పొదూరి దర్శకుడు.