మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rip Ramoji Rao: రామోజీరావుకు నందమూరి ఫ్యామిలీ అశ్రు నివాళి

ABN, Publish Date - Jun 08 , 2024 | 10:16 AM

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు మృతి పట్ల నందమూరి ఫ్యామిలీ ఘనంగా నివాళులు అర్పించింది. బాలకృష్ణ, రామకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారంతా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు.

Ramoji Rao

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు మృతి పట్ల నందమూరి ఫ్యామిలీ ఘనంగా నివాళులు అర్పించింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామకృష్ణ (Nandamuri Ramakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri KalyanRam) వంటి వారంతా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ (Rip Ramojirao Sir).. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రామోజీరావుగారికి అశ్రు నివాళి- నందమూరి బాలకృష్ణ (Balakrishna)

తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు రామోజీ రావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)

రామోజీ రావుగారి లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ఆయన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram)

రామోజీ రావుగారు భారతీయ మీడియా మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేగూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలి: నందమూరి రామకృష్ణ (Ramakrishna)

ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీ రావుగారి ఆకస్మిత మరణం మనందరికీ తీరనిలోటు. వారు తండ్రిసమానులు. ఒక రైతు కుటుంబములో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రుకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు రామోజీ రావు గారు. అన్ని రంగాల్లో వారు వారి సేవలందించారు. ఇటు ప్రెస్ మీడియా/జర్నలిజం లీడరే కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా… వివిధ రంగాల్లోనూ చాలామందికి ఉద్యోగాలు కల్పించి అందరిని ఆదుకున్నారు రామోజీ రావు గారు. వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.

Updated Date - Jun 08 , 2024 | 10:16 AM