NBK109: ఆ బ్లాస్ట్ దీపావళికి.. ఫ్యాన్స్ రెడీనా..

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:12 PM

మాస్‌ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో నందమూరి నటసింహం దిట్ట. మాస్‌తో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ఈ మధ్య వరుస సక్సెస్‌లతో దూసుకెళుతోన్న బాలయ్య తదుపరి సినిమాకు సంబంధించి విజయదశమి స్పెషల్‌గా ఓ అప్డేట్ వదిలారు. అదేంటంటే..

NBK109 Still

మాస్‌ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో నందమూరి నటసింహం దిట్ట. మాస్‌తో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అందించారు. ఈ మధ్య అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్నారీ నందమూరి నటసింహం. ప్రస్తుతం తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (Director Bobby Kolli)తో చేతులు కలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేయగా.. తాజాగా విజయదశమిని పురస్కరించుకుని మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్‌ను వదిలారు.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?


ఇప్పటివరకు ఈ సినిమాకు నిర్మాతలు టైటిల్‌ను రివీల్ చేయలేదు. మరో వైపు ఫ్యాన్స్ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారో అని.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరికొందరైతే రకరకాల టైటిల్స్‌ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో టైటిల్‌తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ దీపావళి (Diwali)కి వారి నిరీక్షణకు తెరపడనుంది. దీపావళి శుభ సందర్భంగా ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ విజయదశమికి అప్డేట్ ఇచ్చారు.


Also Read-
Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ


ఈ విషయం తెలుపుతూ నిర్మాతలు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిలో గుర్రంపై స్వారీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్‌ (God of Masses)ని దర్శకుడు బాబీ, వయొలెంట్ పాత్రలో స్టైలిష్‌గా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2024 | 07:29 PM