Nandamuri Balakrishna: కర్నూలులో బాలకృష్ణ, దేనికంటే...

ABN, Publish Date - Jun 28 , 2024 | 03:00 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న #NBK109 సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ కర్నూలు ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో రాత్రి, పగలు చిత్రీకరణ జరుపుతున్నట్టుగా సమాచారం.

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కర్నూలులో వున్నారు. అయితే ఇదేదో పార్టీ మీటింగ్ కి వెళ్లరానని అనుకునేరు, కాదు, బాలకృష్ణ తాను నటిస్తున్న 109వ సినిమా చిత్రీకరణ కోసం కర్నూలు వచ్చారు. బాబీ కొల్లి ఈ సినిమాకి దర్శకుడు, సితార ఎంటర్ టైనమెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం బాలకృష్ణ, టీము కర్నూలు ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో చిత్రీకరణ చేస్తున్నారు. (Nandamuri Balakrishna is shooting in Kurnool, for his upcoming film directed by Bobby Kolli)

'బాహుబలి' సినిమా కూడా అదే ప్లేస్ లో ఇంతకుముందు చిత్రీకరణ చేశారు, ఇప్పుడు అదే ప్లేస్ లో బాలకృష్ణ #NBK109 కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఒక యాక్షన్ నేపథ్యంలో సాగుతున్న సినిమా. ఈ సినిమాలో ముందుగా మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారు, కానీ ఇప్పుడు అతను చెయ్యడం లేదు. ఆ పాత్రని ఇప్పుడు స్త్రీ పాత్రగా దర్శకుడు మార్చినట్టుగా భోగట్టా.

ఈ సినిమా చిత్రీకరణ కర్నూలులో రేపటి వరకు జరుగుతుందని తెలిసింది. హిందూపూర్ నుండి వరసగా మూడోసారి తెలుగు దేశం పార్టీ తరపున ఎంఎల్ఏ గా ఎన్నికైన బాలకృష్ణ ని చూడటానికి అభిమానులు, లోకల్ పార్టీ ప్రతినిధులు వచ్చినట్టుగా తెలిసింది. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ కూడా వున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఆమె పోలీసు ఆఫీసరుగా నటిస్తోంది.

Updated Date - Jun 28 , 2024 | 03:00 PM