రజనీకాంత్ చిత్రంలో నాగార్జున
ABN, Publish Date - Aug 30 , 2024 | 06:01 AM
రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘కూలీ’ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం
రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘కూలీ’ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో ఆయన పోషిస్తున్న సైమన్ పాత్రను పరిచయం చేస్తూ యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న మరో చిత్రం ‘కుబేర’ నుంచి ఆయన స్టైలిష్ లుక్‌ను విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.