King Nagarjuna: బర్త్‌డే స్పెషల్.. నాగ్ ఫ్యాన్స్‌కి ‘కుబేర’, ‘కూలీ’ టీమ్ ట్రీట్..

ABN, Publish Date - Aug 29 , 2024 | 07:10 PM

కింగ్ నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్ 29) స్పెషల్‌గా ఆయన నటిస్తోన్న ‘కుబేర’, ‘కూలీ’ టీమ్ నుంచి అభిమానులకు ట్రీట్ వచ్చేసింది. అక్కినేని అభిమానులను ఖుషి చేసేలా.. ఈ రెండు చిత్రాల మేకర్స్.. నాగ్ స్పెషల్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో నాగ్‌ది ఓ కీలక పాత్ర కావడం విశేషం. అలాగే ఈ రెండు సినిమాలలో మెయిన్ హీరోలు తమిళ నటులు కావడం గమనార్హం.

King Nagarjun in Kubera and Coolie

కింగ్ నాగార్జున (King Nagarjuna) పుట్టినరోజు (ఆగస్ట్ 29) స్పెషల్‌గా ఆయన నటిస్తోన్న ‘కుబేర’ (Kubera), ‘కూలీ’ (Coolie) టీమ్ నుంచి అభిమానులకు ట్రీట్ వచ్చేసింది. అక్కినేని అభిమానులను ఖుషి చేసేలా.. ఈ రెండు చిత్రాల మేకర్స్.. నాగ్ స్పెషల్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో నాగ్‌ది ఓ కీలక పాత్ర కావడం విశేషం. అలాగే ఈ రెండు సినిమాలలో మెయిన్ హీరోలు తమిళ నటులు కావడం గమనార్హం. ముందుగా ‘కుబేర’ విషయానికి వస్తే.. (Happy Birthday King Nagarjuna)

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్-అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. లీడ్ రోల్స్‌తో సహా రష్మిక మందన్న పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగార్జున న్యూ లుక్‌లో, స్టైలిష్‌గా ఎదురుగా ఉన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. నాగ్ చిరునవ్వు ఎప్పిరియన్స్‌కి ఎలిగెన్స్‌ని యాడ్ చేసింది. హై బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలింగ్వెల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.


‘కూలీ’ విషయానికి వస్తే.. విశ్వనటుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ (Vikram) సినిమాను రూపొందించి రికార్డులు క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ పాత్ర పేరుని, లుక్‌ని నాగ్ బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో నాగ్ ‘సిమన్’ పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో గడ్డంతో.. చేతికి గోల్డ్ వాచ్‌తో ఉన్న నాగ్ లుక్ చూస్తుంటే.. లోకేష్ కనగరాజ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఈ రెండు పోస్టర్స్‌ని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే ట్యాగ్‌తో నాగార్జున పేరుని టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 29 , 2024 | 07:10 PM