Naga Chaitanya: చైతన్య కెరీర్ లో అత్యధిక డీల్ 'తండేల్' సినిమాకే
ABN, Publish Date - Apr 29 , 2024 | 12:15 PM
నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న సినిమా 'తండేల్' డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకుంది. ఇది నాగ చైతన్య కెరీర్ లో అత్యధికంగా డిజిటల్ హక్కులు అమ్ముడుపోయే సినిమాగా నిలిచింది.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న 'తండేల్' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వున్నారు. ఇప్పుడు ఈ సినిమా వార్తల్లో వుంది, ఎందుకంటే ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. (Netflix bought the digital rights of Thandel for Rs 40 crores which is highest for Naga Chaitanya's career) ఎంతకి కొనుగోలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు, అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే ఇది బెస్ట్ అని చెపుతున్నారు.
ఈ 'తండేల్' సినిమా ప్రకటన వచ్చిన దగ్గరనుంచి ఈ సినిమాపై చాలామందికి ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా తీస్తున్న కథ కావటమే. ఈ సినిమా కోసం నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి ముచ్చటగా మూడవ సారి చేతులు కలిపారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాత, అయితే ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.40 కోట్లకి తీసుకుందని తెలిసింది. ఇది నాగ చైతన్య కెరీర్ లో అత్యధికంగా అమ్ముడుపోయే సినిమాగా నిలిచింది.
ఈ సినిమా మొదటి లుక్, టీజర్, అలాగే ఇతర ప్రచారాలకి మంచి ఆదరణ లభించింది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ అన్ని దక్షిణ భారత మరియు హిందీ భాషల కోసం 'తండేల్' డిజిటల్ హక్కులను రూ. 40 కోట్లకు పొందింది. నాగ చైతన్యకు ఇదే అతిపెద్ద డిజిటల్ డీల్. నాగ చైతన్య నడిచిన ఒక వెబ్ సిరీస్ బాగా పోవటం, అలాగే దర్శకుడు చందూ మొండేటి 'కార్తికేయ 2' సినిమా హిందీ మాట్లాడే ప్రదేశాల్లో బాగా నడవటం, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నుండి ఈ సినిమా రావటం, ఇలాంటి అంశాలన్నీ కలిపి 'తండేల్' ను అంత డబ్బులు పెట్టి తీసుకోవటానికి నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది అని తెలుస్తోంది.