Naga Chaitanya: ‘తండేల్’ ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే.. దుల్లకొట్టేద్దాం

ABN, Publish Date - Nov 05 , 2024 | 07:57 PM

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, సాయి పల్లవి ఏమన్నారంటే..

Naga Chaitanya and Sai Pallavi

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ‘తండేల్’ సినిమా 7 ఫిబ్రవరి, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్‌డే కి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే పర్ఫెక్ట్ ఆపర్చునిటీగా ఈ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ చెప్పుకొచ్చారు. (Thandel Release Announcement)

Also Read- KA: ‘క’ సినిమాలో చూపించిన ఆ గ్రామం నిజంగానే ఉంది.. ఎక్కడో తెలుసా


ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తి చేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్‌కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్‌గారిని రిలీజ్ డేట్ గురించి అడిగాను. ఆయన ముందు సినిమా చూపించండని అడిగారు. నేను అనుకున్న సినిమా అక్కడ కనిపిస్తే రిలీజ్ డేట్ చెప్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అంటే ఇలానే తీయాలి. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. వారి కష్టం దేశం అంతా షేక్ చేసింది. మేము ఎడిట్ చూశాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ తేదీపై నేను చాలా సంతోషంగా వున్నాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. ‘100 పర్సంట్ లవ్’ సినిమాతో వాసుతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. చాలా పెద్ద కాన్వాస్ సినిమా ఇది. ఈ పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై నెక్స్ట్ లెవల్‌లో చూపించాలని డైరెక్టర్ చందూ చాలా కష్టపడ్డారు. సాయి పల్లవి క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌. తన పాత్ర గురించి కాదు అన్ని పాత్రల గురించి ఆలోచిస్తూ చాలా సపోర్ట్ చేస్తుంది. ఫిబ్రవరి 7.. దుల్లకొట్టేదాం. అందరికీ థాంక్యూ అని చెప్పుకొచ్చారు.


హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ వేడుకుని చూస్తుంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా అనిపిస్తుంది. ఈ సినిమా చేసినప్పుడు కంటే ఇప్పుడు చాలా పెద్ద కాన్వాస్ అయింది. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాస్ గారు నాకు ఎలాంటి అవార్డు వచ్చినా, నా సినిమా సక్సెస్ సాధించినా ఎంతగానో గౌరవించి, సన్మానిస్తారు. ఒక కూతురులా చూసుకుంటారు. దానికి నేను థాంక్యూ తప్ప ఇంకేం చెప్పలేను. మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో జనాలకి అప్పుడు నచ్చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ డేట్ అది. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటాను. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. అందరికీ థాంక్యూ సో మచ్ అని అన్నారు.

Also Read-Nivetha Pethuraj: బాలుడి చేతిలో మోసపోయా

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీని రూపొందిస్తున్నారు. లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ రష్ మూమెంట్స్ బ్లెండ్‌తో ఈ సినిమా ఉండబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read-Suriya - NBK: సింగం, సమరసింహం ఒకే స్టేజ్‌పై.. ‘ఐ లవ్ యు’

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2024 | 07:57 PM