నా పాత్ర ఎంతో ప్రత్యేకం
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:44 AM
‘ఈగల్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా టీ.జీ.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ఈ నెల 11న విడుదలవుతోంది...
‘ఈగల్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా టీ.జీ.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను కావ్య థాపర్ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇందులో నా పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నాది నెగెటివ్ ఛాయలున్న పాత్ర. ఆధ్యంతం వినోదం పంచుతుంది. చాలామంది కమెడియన్స్ ఇందులో నటించారు. ఈ సినిమా కోసం శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. గోపీచంద్‌తో నటించడం మర్చిపోలేని అనుభవం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అని చెప్పారు.