ఎన్టీఆర్‌తో నా జర్నీ ఎప్పుడూ స్పెషలే!

ABN, Publish Date - Sep 25 , 2024 | 01:27 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ‘దేవర’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...

జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ‘దేవర’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను మీడియాకు తెలియజేశారు.

  • మనిషికి మితిమీరిన ధైర్యం కూడా కరెక్ట్‌ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండానే మనలో ఓ భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెప్పే కథ ‘దేవర’. అయితే భయం లేకుండా ఉండాలనుకోవడం తప్పు. లా ఆఫ్‌ ల్యాండ్‌ అనేది ఉంటుంది కదా. దాన్ని అందరూ పాటించాలి. జవాబుదారీతనం కూడా ఒక భయమే. ఇలాంటి భయం ఉండడం వల్ల మనం చేసే పనిని చెక్‌ చేసుకుని మంచి రిజల్ట్‌ పొందుతాం.


  • ఎన్టీఆర్‌తో జర్నీ ఎప్పుడూ నాకు స్పెషలే. ఏ విషయమైనా ఆయనతో డిస్కస్‌ చేసినప్పుడు బాగున్నా, బాగో లేకపోయినా డిప్లొమాటిక్‌గా సమాధానం చెప్పరు. ఓపెన్‌గా మనసులో ఉన్న భావాన్ని చెబుతారు. ‘దేవర’ లైన్‌ చెప్పినప్పుడు ఎన్టీఆర్‌ స్పందించిన తీరుతోనే నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

  • ‘దేవర’ సినిమాను సెట్స్‌కు తీసుకెళ్లడానికి ఆరు నెలల సమయం తీసుకున్నాం. సముద్రం మీద ఎలా షూట్‌ చేయాలి, అక్కడ లైటింగ్‌ లో ఎలాంటి వేరియేషన్స్‌ ఉంటాయి. మనం సముద్రాన్ని ఎలా క్రియేట్‌ చేసుకోవాలి.. అనే అంశాలను బాగా స్టడీ చేశాం. దానికి ఎక్కువ సమయం పట్టింది. మన టెక్నీషియన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన టాలెంట్‌ ఉన్నవాళ్లు ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా స్పాట్‌కు వెళ్లినా వర్క్‌ చేసెయ్యగలరు. హాలీవుడ్‌ టెక్నీషియన్లు అలా కాదు. వాళ్లు ప్రిపేర్‌ కాకపోతే భయపడిపోతారు. ప్రతి సన్నివేశాన్నీ రిహార్సల్స్‌ చేసుకుని వెళతారు. మనవాళ్లకు కూడా హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ తరహాలో ప్రిపరేషన్‌ టైమ్‌ ఇస్తే ఇంకా అద్భుతాలు చేస్తారు.


  • ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే దానికి ఒత్తిడేం పడలేదు. ‘దేవర’ చిత్రానికి ఇంకా బాగా ప్రిపేర్‌ అయ్యా. ‘ఆచార్య’ రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే దేవర సినిమా మోషన్‌ పోస్టర్‌ పనిలో నిమగ్నమయ్యా.

  • ఇంత పెద్ద కథను మూడు గంటల లోపు చెప్పగలమా అని ‘దేవర’ సెకండ్‌ షెడ్యూల్‌ టైమ్‌లోనే అందరం అనుకున్నాం. ఎందుకంటే నేరేషన్‌ నాలుగు గంటలుంది. పేపర్‌ మీద పెట్టినప్పుడు అది ఆరేడు గంటలు వచ్చింది. అయినా రెండు పార్టులు వద్దనుకుని రివర్స్‌లో వెళ్లాం. కానీ కుదరదని తేలిపోయింది. దాంతో రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం.

  • కథ రాసుకునేటప్పుడే దేవర, అతని కొడుకు వర పాత్రలకు ఎన్టీఆర్‌నే అనుకున్నా. మరో హీరో కోసం రాసుకున్న కథ కాదు. మనిషిలో భయం ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేశా. ఆ భయాన్ని జాన్వీకపూర్‌లో చూశా. వారం పది రోజుల ముందే సీన్‌ పేపరు కావాలని అడిగి నా దగ్గర తీసుకుని ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కు వచ్చేది. ఫస్ట్‌ డే షూటింగ్‌లో ఆమె పాల్గొన్న సీన్‌ పూర్తి కాగానే తారక్‌ ‘ఫెంటాస్టిక్‌’ అంటూ అభినందించారు.


  • ‘ఓంకార’ సినిమా చూశాక భైర పాత్రకు సైఫ్‌ అలీఖాన్‌ సరిపోతాడని ఫీల్‌ అయ్యా. కానీ ఆయనలో నార్త్‌ లుక్‌ ఉంటుందేమోనని సందేహించా. లుక్‌ టెస్ట్‌ చేద్దామని చెప్పి స్కెచ్‌ వేసి పంపించా. ఆయనే ముందు నమ్మలేదు. షూటింగ్‌కు ఒక గంట ముందే వచ్చి ప్రిపేర్‌ అయ్యేవారు. ‘భైర’ ఎలా ఉండాలని నేను అనుకున్నానో సైఫ్‌ అలాగే ఉన్నారు.

  • అనిరుధ్‌ మ్యూజిక్‌కు నేను హ్యాపీ. నా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని మంచి సంగీతం ఇచ్చాడు. త్వరలోనే ఆయుధ పూజ సాంగ్‌ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాం.

Updated Date - Sep 25 , 2024 | 01:27 AM