Music Shop Murthy: అజయ్ ఘోష్‌‌తో అనగానే వీళ్ళ పని అయిపోయినట్లే అనుకున్నారట..

ABN, Publish Date - Jul 29 , 2024 | 09:58 PM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవడమే కాకుండా.. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లుగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో సైతం మంచి స్పందనను రాబట్టుకుంటుండగా.. తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు.

Music Shop Murthy Success Meet

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music ShoP Murthy). ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవడమే కాకుండా.. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లుగా రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు ఓటీటీలలోనూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. అటు థియేటర్, ఇటు ఓటీటీలలో మంచి స్పందనను రాబట్టుకున్న నేపథ్యంలో తాజాగా మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. (Music Shop Murthy Movie Success Meet)

ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే ఇది. సక్సెస్ అయిన వారెవరైనా ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్‌గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే. డైరెక్షన్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన ఇన్‌ఫ్లుయన్సర్లు, పీఆర్ఓ సతీష్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు. డైరెక్టర్ శివ (Director Siva Paladugu) మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ఇది. ఈ సినిమా తీశాక సినిమా ఎలా తీయాలి. కష్టనష్టాలు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తానని అన్నారు.


ముఖ్య అతిథిగా హాజరైన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా ట్రైలర్ చూశా. ఈ అజయ్ ఘోష్‌ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోయినట్లే అనుకున్నా. మొన్న మిడ్ నైట్ మెలకువ రావడంతో ఈ సినిమా చూశా. 40 నిమిషాల సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. మంచివాళ్ళు కూడా ఏడిపించారు. ప్రతి పాత్రకు జస్టిఫికేషన్‌ ఇచ్చినతీరు చాలా బాగుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది. మౌత్ పబ్లిసిటీతో సినిమా సక్సెస్ అవుతోంది. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్ళకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేయండని అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరీ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా కథ విన్నప్పుడే దీనిపై నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాగా ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా ప్రతి ఏజ్ గ్రూప్‌కి కనెక్ట్ అయ్యే సినిమా అవుతుందని ముందే ఊహించాం. అదే జరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్న వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ శివ గారితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమా మిగతా భాషల్లో కూడా రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పీఆర్ఓ సతీష్ పాత్ర గొప్పది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మంచి సంగీతం అందించారు. నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా బాగా కనిపించానని అంతా అంటున్నారు. అందుకు‌గాను డీఓపీకి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 29 , 2024 | 09:58 PM