Sri Vasanth: రచయితగా.. సంగీత దర్శకుడు
ABN , Publish Date - Jun 14 , 2024 | 08:17 PM
అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమాతో సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచుతుడైన శ్రీ వసంత్.. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తన మార్క్ ప్రదర్శించారు. ఇప్పుడాయన రచయితగానూ మారి మంచి సక్సెస్ అందుకున్నారు. విజయ్ సేతుపతి హీరోగా.. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహారాజ’ చిత్రానికి శ్రీ వసంత్ పాటలు, మాటలు అందించారు.
అల్లరి నరేష్ ‘సుడిగాడు’ (Allari Naresh Sudigadu) సినిమాతో సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచుతుడైన శ్రీ వసంత్ (Sri Vasanth).. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తన మార్క్ ప్రదర్శించారు. ఇప్పుడాయన రచయితగానూ మారి మంచి సక్సెస్ అందుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా.. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళనిస్వామి నిర్మించిన చిత్రం ‘మహారాజ’ (Maharaja). ఈ సినిమా జూన్ 14న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శ్రీ వసంత్ పాటలతో పాటు మాటలు కూడా రాశారు.
Also Read- Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు
‘మహారాజ’ సినిమాలోని ‘అమ్మ నీకే నాన్నయ్యనా’ అంటూ సాగే పాటలో శ్రీ వసంత్ సాహిత్యం మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ పాటకు అజనీస్ లోకనాధ్ సంగీతం మరో బిగ్ అసెట్. ‘మహారాజ’ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. అలాగే ‘మహారాజ’ రివ్యూస్‌లో కూడా ప్రత్యేకంగా మాటలు, పాటల గురించి అంతా ప్రస్తావిస్తుండటం విశేషం. (Music Director Sri Vasanth)
విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహారాజ’ చిత్రం.. ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా శ్రీ వసంత్ తెలిపారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ ‘పోస్ట్ ప్రో మీడియా వర్క్స్’లో ‘మహారాజ’ సినిమా డబ్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కూడా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్‌లోనే డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంది.
Read Latest Cinema News