మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hema Rave Party: అనుకున్నంతా అయింది.. హేమపై ‘మా’ తీసుకున్న యాక్షన్ ఇదే..

ABN, Publish Date - Jun 06 , 2024 | 03:39 PM

ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీలో ‘మా’ సభ్యురాలైన హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడం‌తో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు. ఇప్పుడు చెప్పినట్లే ఆమె ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

MAA - Hema

ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీలో ‘మా’ (Maa) సభ్యురాలైన హేమ (Hema) డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడం‌తో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు (Manchu Vishnu) ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు. ఆ తర్వాత బెంగళూర్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పాటు ఇప్పటికే బెంగుళూరు పోలీసుల ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆమెపై యాక్షన్ తీసుకునేందుకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు బుధవారం మెంబర్స్‌తో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ చర్చలలో మెజార్టీ మెంబర్స్ హేమను సస్పెండ్ చేయాలనే నిర్ణయాన్ని వెలిబుచ్చడంతో.. నటి హేమ MAA ప్రాథమిక సభ్యత్వాన్ని మంచు విష్ణు రద్దు చేసి (Hema Membership Suspended).. ఆమెపై విచారణ జరిగినంతకాలం సస్పెండ్ విధించినట్లుగా సమాచారం.

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?

బెంగళూర్ రేవ్ పార్టీ విషయంలో హేమకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను సీసీబీ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనేకల్ జేఎంఎఫ్‌సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు.. హేమను 24 గంటల పాటు విచారణ జరిపేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారని తెలిసింది.

Also Read- Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!


అసలేం జరిగిందంటే.. (Bengaluru Rave Party)

బెంగళూరులో జరిగిన ఓ రేవ్‌ పార్టీలో పలువురు సెలబ్రిటీలతోపాటు నటి హేమ కూడా ఉందని టాక్‌ రావడంతో అలెర్ట్‌ అయిన హేమ (Actress Hema) ఓ ఫేక్‌ వీడియో రిలీజ్‌ చేసి హైదరాబాద్‌లోనే ఓ ఫామ్‌హౌస్‌లో చిల్‌ అవుతున్నానని ప్రకటించింది. అయితే అక్కడున్న వారిలో హేమ కూడా ఉందని మాదక ద్రవ్యాలు సేవించిందని ఆ సాయంత్రానికే పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమెను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరల్‌ ఫీవర్‌ అంటూ హేమ విచారణ హాజరు కాకపోవడంతో మరోసారి పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Read Latest Cinema News

Updated Date - Jun 06 , 2024 | 03:55 PM