అమ్మ కల నెరవేరింది

ABN, Publish Date - Sep 01 , 2024 | 05:34 AM

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ శనివారం కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణమఠాన్ని సందర్శించారు. తన తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలసి ఆయన ఉడుపికి వెళ్లారు....

సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ శనివారం కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణమఠాన్ని సందర్శించారు. తన తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలసి ఆయన ఉడుపికి వెళ్లారు. ‘మా అమ్మ ఎప్పుడూ తన సొంతూరు కుందాపురాతో పాటు ఉడుపి శ్రీకృష్ణుని దర్శనానికి తీసుకెళ్లమని అడుగుతుంది. ఇన్నాళ్లకు అమ్మ కల నెరవేరింది. సెప్టెంబర్‌ 2న అమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు నేను ఇచ్చే బహుమతి ఇదే’ అని ఎన్టీఆర్‌ తెలిపారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ‘కాంతార’ ఫేం రిషబ్‌ శెట్టి, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ మఠంలో అందరూ పూజలు నిర్వహి ంచారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 01 , 2024 | 05:34 AM