ఆ తప్పులన్నీ మోహన్‌లాల్‌కు తెలుసు
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:31 AM
నటి, పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సుకుమారన్ హేమ కమిటీ నివేదిక, నటుడు మోహన్‌లాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్)లో...
నటి, పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సుకుమారన్ హేమ కమిటీ నివేదిక, నటుడు మోహన్‌లాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్)లో ఏ సమస్యపై నోరు మెదపని వారికే ప్రాముఖ్యత ఎక్కువ. పేదరికంలో ఉన్న కళాకారులకు ఇచ్చే పథకాల్లోనూ అవకతవకలు జరిగాయి. ఈ సంస్థలో జరిగే తప్పులన్నీ మోహన్‌లాల్‌కు తెలుసు. అమ్మలో పక్షపాతం రాజ్యమేలుతోంది’’ అని ఆరోపించారు. అలాగే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటి భావన గురించి మాట్లాడుతూ ‘‘ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయం నూటికి నూరు శాతం వాస్తవం. ఏడేళ్లు గడిచినా ఈ విషయంలో ఆమెకు ఇంకా న్యాయం ఎందుకు జరగట్లేదు. ఆమెకు సత్వర న్యాయం జరగాలి’’ అని డిమాండ్ చేశారు.