Game Changer: మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌ ‘నానా హైరానా’ ఆగయా..

ABN, Publish Date - Nov 28 , 2024 | 07:20 PM

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘నానా హైరానా’ అంటూ సాగిన ఈ పాట ఎలా ఉందంటే..

Game Changer Movie Still

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాల న‌డుమ 2025 సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌ అయిన రొమాంటిక్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ పాట ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రుస్తోంది. ఈ పాట‌ను తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాయ‌గా, త‌మిళంలో వివేక్‌, హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. ఈ పాట‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన బీటీఎస్‌ కూడా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ పాట‌లోని స్వ‌చ్ఛత‌ను హావ‌భావాల రూపంలో ప‌లికించారు.

Also Read-ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ‘దేవర’ మదర్

పాట విషయానికి వస్తే.. ప్రేమ‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఒక‌రిపై ఒక‌రికి మ‌న‌సులోని ప్రేమ భావాలను ప‌దాల రూపంలో అందంగా అమ‌ర్చిన‌ట్లు ఈ పాటకు లిరిక్స్ కుదిరాయి. ఇక మేకింగ్ విష‌యానికి వ‌స్తే శంక‌ర్ మ‌రోసారి పాట‌ల‌ను చిత్రీక‌రించ‌టంలో త‌న‌కు తానే సాటి అని ఈ ‘నా నా హైరానా’ పాట‌తో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాట‌ను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు. ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో పాట మ‌న‌సుని ఆహ్లాద ప‌రుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని అనిపించేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో ఉప‌యోగించ‌టం విశేషం.


సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నగేమ్ చేంజ‌ర్ సినిమాలోని ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అనౌన్స్ చేసిన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్లో పాట‌పై అంచ‌నాల‌ను ఎంత‌గానో పెంచింది. ఇప్పుడు పాట విడుద‌ల అనంతరం అంతా పాట బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూపించ‌న‌టువంటి ఓ స‌రికొత్త అవ‌తార్‌లో శంక‌ర్ ఆవిష్క‌రిస్తున్నారు. సినిమాలో హై రేంజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, పొలిటిక‌ల్ ఎలిమెంట్స్‌, ఆక‌ట్టుకునే క‌థ‌నం, న‌టీన‌టుల అద్భుత‌మైన ప‌నితీరు ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతినిస్తాయని యూనిట్ చెబుతోంది. ఎస్‌.జె.సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, శ్రీకాంత్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2024 | 07:20 PM