Matka: పవర్ ప్యాక్డ్ పోస్టర్.. మెగా ప్రిన్స్ మాస్ అవతార్

ABN, Publish Date - Oct 15 , 2024 | 10:28 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో వింటేజ్ అవతార్‌లో వరుణ్ దర్శనమిస్తున్నారు.

Mega Prince Varun Tej In Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ (Matka) రిలీజ్‌కు రెడీ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా ప్రస్తుతం జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా మేకర్స్ ‘మట్కా’ 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

Also Read- Raveena Tandon: ముందే ప్లాన్ చేశారు.. తనపై అటాక్ చేసిన గుంపుపై షాకింగ్ కామెంట్స్

నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వదిలిన కౌంట్‌డౌన్ పోస్టర్‌లో వరుణ్ తేజ్ సోఫాలో కూర్చుని ఒక చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్‌తో కనిపించి.. మాస్ అవతార్‌లో దర్శనమిచ్చారు. ‘వైలెన్స్ విత్ విజన్’ అనే క్యాప్షన్‌తో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ వింటేజ్ అవతార్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


‘మట్కా’ మూవీ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. మూడు వైవిధ్యతరహా పాత్రలలో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 10:28 PM