నిర్మాతలతో ఇన్‌కమ్ టాక్స్ అధికారుల సమావేశం
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:51 AM
తెలుగు నిర్మాతలతో ఆదాయపు పన్ను అధికారులు సోమవారం ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు...
తెలుగు నిర్మాతలతో ఆదాయపు పన్ను అధికారులు సోమవారం ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి వివిధ గడువు తేదీల గురించి, సినిమాల నిర్మాణం, రాబడికి సంబంధించిన అకౌంటింగ్ గురించి ఈ కార్యక్రమంలో అధికారులు వివరించారు. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ఎస్. మూకాంబికేయన్, టి.మురళీధర్, కె.శ్రీనివాసరావు, సతీశ్ తదితర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర ప్రసాద్ సహా పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.