అరకులో మాస్‌ జాతర

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:25 AM

రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు...

రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ పాత్రలో రవితేజ నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. సినిమా తాజా షెడ్యూల్‌ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ తరవాత పాడేరు, ఆంధ్రా- ఒడిషా సరిహద్దు లొకేషన్స్‌లో చిత్రీకరణ జరగనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2024 | 03:25 AM