మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రావు రమేష్‌ హీరోగా ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’

ABN, Publish Date - Mar 13 , 2024 | 03:49 AM

విలక్షణ నటుడు రావు రమేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్‌ సరసన ఇంద్రజ నటించారు...

విలక్షణ నటుడు రావు రమేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్‌ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్‌ కీలక పాత్రధారులు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా సరికొత్త రీతిలో మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘’ఇప్పటి వరకు రావు రమేష్‌ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎంటర్టైన్‌ చేస్తారు. పూర్తి స్థాయి వినోదంతో పాటూ ప్రేక్షకులని కదిలించే భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’ ఉంటుంది’’ అని చెప్పారు. రావు రమేష్‌ మాట్లాడుతూ ‘’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎవరు ఆవిష్కరిేస్త బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బాగుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: ఎంఎన్‌ బాల రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్‌ మర, ఆర్ట్‌ డైరెక్షన్‌: సురేష్‌ భీమంగని.

Updated Date - Mar 13 , 2024 | 03:49 AM